|
|
by Suryaa Desk | Thu, Jul 31, 2025, 01:53 PM
జులై 30న సోనూసూద్ 52వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. వృద్ధులకు గౌరవంతో జీవించేలా వసతి, ఆహారం, వైద్యం, మానసిక శాంతి కల్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఈ సేవా కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. అయితే, ఎక్కడ నిర్మించనున్నారనేది ఆయన తెలుపలేదు.
Latest News