|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:38 AM
తేజ సజ్జా కథానాయకుడిగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. 'హనుమాన్' వంటి భారీ విజయం తర్వాత తేజ సజ్జా నటిస్తున్న చిత్రమిది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. రితికా నాయక్ కథానాయిక. మంచు మనోజ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. శ్రియ, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రధారులు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. అక్కడ స్పెషల్‌గా వేసిన సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా ఛేజింగ్ సీన్ తెరకెక్కిస్తున్నారు. తేజ సజ్జా సూపర్ హీరోగా శక్తిమంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఆయుధం చుట్టూ సాగే ఈ కథని, విజువల్ వండర్‌గా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు. సెప్టెంబరులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే వారంలో ఓ పాటని విడుదల చేయడానికి రంగం సిద్ధమైంది. గౌర హరి సంగీతం అందిస్తున్నారు.
Latest News