|
|
by Suryaa Desk | Mon, Jul 21, 2025, 11:37 AM
‘మా బ్యానర్‌లో తెలిసి చేసిన తప్పు ‘రణరంగం’ సినిమా తీయడం అని నిర్మాత నాగ వంశి అన్నారు. శర్వానంద్‌కు ఏజ్డ్ క్యారెక్టర్ కరెక్ట్ కాదని బాబాయ్ చెప్పినా నేనూ సుధీర్ వినిపించుకోలేదు. అయినా రిస్క్ చేసి సినిమా చేశాం. రవితేజ లాంటి నటుడు చేసి ఉంటే బాగుండేదేమో. ఫస్ట్ సీన్‌లో శర్వాను డాన్‌గా చూపించాం. అతడు డాన్ ఎలా అయ్యాడన్నది తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రేక్షకుడికి ఏం ఉంటుంది? అని ఒక విమర్శకుడు అడిగారు. కరెక్టే కదా అనిపించింది. ఆ తర్వాత అలాంటి తప్పులు చేయకూడదని కథల విషయంలో నిర్మొహమాటంగా ఉండే వారితో చర్చలు జరుపుతుండేవాడిని. అయినా మళ్లీ దెబ్బ తిన్నాం. ‘ఆది కేశవ’ ఫ్లాఫ్ అయింది. అవుట్‌పుట్ చూసుకున్న తర్వాత రిపేర్ చేయడానికి ప్రయత్నించాం. కానీ రోజురోజుకీ స్టోరీ జానర్ మారిపోతుంది. ప్రేక్షకులు ఓ పట్టాన యాక్సెప్ట్ చేయడం లేదు. దాంతో రిపేర్లు చేయడం కూడా వృథా అనిపించింది. ఈ రెండు సినిమాలు మా బ్యానర్‌లో చాలా ఖరీదైన తప్పులు అని తెలిపారు.
Latest News