|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:30 PM
డిజిటల్ వీక్షకులను అలరించేందుకు ఓ డిపరెంట్ పోస్ట్ - అపోకలిప్టిక్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం కలియుగం 2064 ఓటీటీకి వచ్చింది. జర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాథ్, కన్నడ కిశోర్ కీలక పాత్రలు పోషించగా ప్రమోద్ సుందర్ దర్శకత్వం వహించాడు. వరల్డ్ వార్ తర్వాత ఆహారం దొరక్క, నీటి ఎద్దటి ఏర్పడితే ఏం జరుగుతుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో, ఇప్పటి వరకు ఏ సినిమాలోను టచ్ చేయని పాయింట్‌ను తీసుకొని ఓ యాక్షన్, థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే పలు ఓటీటీల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ తెలుగులో రాలేదు. కాస్త గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేశారు.
Latest News