![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:28 PM
'కలర్ ఫొటో' ఫేం సుహాస్ ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. మినిమం గ్యారెంటీ అనేలా ఆయన సినిమాలు ఉంటాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం 'ఓ భామ.. అయ్యో రామ'. మాళవిక మనోజ్ కథానాయిక. రామ్ గోదల దర్శకత్వంలో హర్ష నల్ల నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సుహాస్ ఖాతాలో హిట్ పడిందా? అనేది చూద్దాం.
కథ:రామ్ (సుహాస్) చిన్నతనంలోనే తల్లి (అనిత)ను కోల్పోతాడు. తండ్రికి (రవీంద్ర విజయ్ ) రామ్ అంటే గిట్టదు. అతన్ని దూరం పెడతాడు. తల్లే అతని బాగోగులు చూసుకుంటుంది. అకస్మాత్తుగా తల్లి మరణించడంతో మేనమామ (అలీ) అతని బాధ్యత తీసుకుంటాడు. అక్కడి నుంచి రామ్‌కి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు. రామ్ దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ అతను సినిమాలకు దూరంగా ఉంటూ పెద్ద చదువుల కోసం ఫారెన్ వెళ్లానుకుంటాడు. అతని జీవితంలోకి సత్యభామ (మాళవిక మనోజ్) అనే అమ్మాయి రావడంతో తన జీవితం మారిపోతుంది. అమ్మ లేని లోటును సత్యభామ తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణమేంటి? సినిమా డైరెక్టర్ కావాలానే తల్లి కోరికకు అతను ఎందుకు దూరంగా ఉన్నాడు? రామ్, సత్యభామల ప్రేమ కథ కంచెకు చేరిందా లేదా? అన్నది కథ.
Latest News