|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 06:13 PM
గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న హాస్య చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. నటి ప్రవీణ పరుచూరి దర్శకత్వం వహిస్తూ, గోపాలకృష్ణ పరుచూరితో కలసి నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. మనోజ్ చంద్ర, మౌనిక టి, బెనర్జీ ప్రధాన తారాగణం. ఈ నెల 18న ఈ చిత్రం విడుదలవుతోంది. చిత్రబృందం గురువారం ట్రైలర్ను విడుదల చేసింది. స్నేహం, వినోదం ప్రధానాంశాలుగా కుటుంబ నేపథ్యంలో రూపుదిద్దుకున్న చిత్రమిదని ట్రైలర్ను బట్టి తెలుస్తోంది. పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిదని మేకర్స్ తెలిపారు.
Latest News