|
|
by Suryaa Desk | Fri, Jul 11, 2025, 12:13 PM
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ఇటీవల విలాసవంతమైన కారు కొనుగోలు చేశారు. దాదాపు రూ.4.57 కోట్ల విలువగల హై ఎండ్ హమ్మర్ EV 3X ఎలక్ట్రిక్ కారును ఆయన తన గ్యారేజీలోకి తీసుకొచ్చారు. ఈ కారును రణ్‌వీర్ తన పుట్టిన రోజు కానుకగా జూలై 6న తీసుకున్నారని సమాచారం. తాజాగా ఈ ఈవీ కారుతో రణ్‌వీర్ కనిపించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఒమేగా స్పెషల్ ఎడిషన్ లో భాగంగా వెయ్యి కార్లను తయారుచేసింది ఈ కంపెనీ. ఇందులో ఒక కారు ఇప్పుడు రణ్వీర్ ఇంటికి చేరింది. కంప్లీట్ లగ్జరీతో పాటు ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్లు దీని సొంతం. కేవలం 4 గంటలు ఛార్జింగ్ చేస్తే చాలు, ఏకథాటిగా 600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది.రణ్వీర్ దగ్గర దాదాపు అన్ని లగ్జరీ బ్రాండ్స్ ఉన్నాయి. రేంజ్ రోవర్, లాంబోర్గిని, ఆస్టిన్ మార్టిన్, బెంజ్, జాగ్వార్, ఆడి, టయోటా కార్లున్నాయి. కెరీర్ ప్రారంభంలో తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న మారుతి సుజికీ సియాజ్ కారును కూడా అతడు తన గ్యారేజీలోనే పెట్టుకున్నాడు.
Latest News