|
|
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 08:04 AM
డాకు మహారాజ్: టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల 'డాకు మహారాజ్' లో నటించారు. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా ప్రేక్షకులని భారీ స్థాయిలో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించగా, బాబీ డియోల్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించారు. శ్రద్ధా శ్రీనాథ్, చాంధిని చౌదరి, సత్య, ఊర్వశి రౌటేలా మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జులై 13న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నాగ వంశీ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌పై సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చారు.
హనుమాన్: ప్రశాంత్ వర్మ యొక్క సూపర్ హీరో యాక్షన్ చిత్రం "హనుమాన్" 2024లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ 250 కోట్ల గ్రాస్‌ను అధిగమించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు ఛానల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జులై 13న సాయంత్రం 6 గంటలకి ప్రదర్శించటానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తేజ సజ్జ ప్రేమికురాలిగా అమృత అయ్యర్ నటించగా, అతని సోదరిగా వరలక్ష్మి శరత్‌కుమార్ నటించింది. వినయ్ రాయ్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి ఈ విఎఫ్‌ఎక్స్ భారీ చిత్రాన్ని నిర్మించారు.
Latest News