|
|
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 03:10 PM
TG: దర్శకుడు ఎస్.రాంబాబు కన్నుమూశారు. సీనియర్ నటి ఆమని ప్రధాన పాత్రలో తెలంగాణ జానపద కళారూపమైన ఒగ్గు కథ నేపథ్యంలో రాంబాబు 'బ్రహ్మాండ' అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసి విడుదలకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ప్రివ్యూ షో చూస్తూ థియేటర్లోనే కన్నుమూశారు. తీవ్ర గుండెపోటుకు గురై మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బుధవారం సాయంత్రం ఆయన స్వగ్రామం అల్లీపూర్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.
Latest News