|
|
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:15 PM
మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి వచ్చే పోస్టులు, మెసేజ్‌లు హ్యాకర్లు పంపుతున్నవేనని స్పష్టం చేస్తూ.. అవి నమ్మవద్దని, అనుమానాస్పద లింకులు క్లిక్ చేయొద్దని అభిమానులను హెచ్చరించారు. ఖాతాను తిరిగి నియంత్రణలోకి తీసుకురావడానికి సంబంధిత బృందంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు.
Latest News