![]() |
![]() |
by Suryaa Desk | Tue, Jul 08, 2025, 03:16 PM
గుడ్ నైట్ అండ్ లవర్ తరువాత తమిళ నటుడు మానికందన్ జనవరి చివరి వారంలో విడుదలైన ఫ్యామిలీ డ్రామా 'కుడుంబస్థాన్' తో వరుసగా మూడో హిట్ చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తమిళనాడులో 25 కోట్లు గ్రాస్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ సినిమా యొక్క తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ సినిమాలు ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా జీ సినిమాలు ఛానల్ లో త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రానికి రాజేశ్వర్ కాలిమి దర్శకత్వం వహించారు, అతను ప్రసన్న బాలచంద్రన్‌తో పాటు ఈ కథను కూడా రాశాడు. ఈ చిత్రంలో సాన్వే మేఘన మహిళా ప్రధాన పాత్ర పోషించింది. గురు సోమసుందరం, ఆర్. సుందర్రాజన్, కుడాసనాద్ కనకం, బాలాజీ సాక్తివెల్, మరియు వర్గీస్ మాథ్యూ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి వైసాఖ్ సంగీతాన్ని అందించారు.
Latest News