![]() |
![]() |
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 05:39 PM
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి "ది రాజా సాబ్" అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ చిత్రం సినీ ప్రేమికులలో విపరీతమైన ఆసక్తిని కలిగిస్తుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. "ది రాజా సాబ్" సాంకేతిక బృందంలో ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్ పళని, సంగీతం స్వరకర్తగా థమన్ ఎస్. సినిమా ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ మరియు కింగ్ సోలమన్ కాగా, ఆర్.సి. కమల్ కన్నన్ VFXని నిర్వహిస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, SKN క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఈ రొమాంటిక్ హారర్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్-ఇండియా విడుదల కోసం రూపొందించబడిన ఈ చిత్రం 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సత్యరాజ్, జరీనా వహాబ్, వరలక్ష్మి శరత్‌కుమార్, యోగి బాబు, జిషు సేన్ గుప్తా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News