|
|
by Suryaa Desk | Mon, Jul 07, 2025, 04:33 PM
మలయాళ ఇండస్ట్రీ ఈ ఏడాది కూడా తన సత్తా చాటుతుందనే చెప్పాలి. వరుస విజయాలు నమోదవుతూ వెళుతుండగా, తాజాగా ఆ జాబితాలోకి మరో హిట్ వచ్చి చేరింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఆ సినిమా పేరే 'నరివెట్ట'. టోవినో థామస్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, మే 23వ తేదీన అక్కడి థియేటర్లలో విడుదలైంది. తెలుగు వెర్షన్ అదే నెల 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించాడు. టిప్పు షాన్ - షియాస్ హాసన్ నిర్మించిన ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'సోనీ లివ్' దక్కించుకుంది. ఈ నెల 11వ తేదీ నుంచి మలయాళంతో పాటు, తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. సూరజ్ వెంజరమూడు చేరన్ ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, థియేటర్ల వైపు నుంచి 30 కోట్లకి పైగా వసూలు చేసింది. 22 ఏళ్ల క్రితం కేరళలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ముత్తంగ అనే ఒక తెగకి చెందిన ఆదివాసీల నివాస ప్రాంతాలను ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయత్నించడం అందుకు వాళ్లు నిరాకరించడం ఆ సమయంలో వర్గీస్ పీటర్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఏం చేశాడు అనే అంశంపై ఈ కథ నడుస్తుంది. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.
Latest News