|
|
by Suryaa Desk | Sun, Jul 06, 2025, 12:25 PM
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుందామె. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమయాణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల నుంచి నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఓ ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌కు విడాకులు ఇవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు.నయనతార తాజాగా తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో వైవాహిక జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది నయనతార. 'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు మ్యారేజ్ అనేది పెద్ద మిస్టేక్. నీ భర్త చేసే పనులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా మెచ్యూర్ కాదు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఆల్రెడీ చాలా ఫేస్ చేశా మీవల్ల' అంటూ నయనతార తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఆమె ఈ పోస్ట్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారనేది మాత్రం వివరణ ఇవ్వలేదు. దీంతో నయనతార తన భర్తకు విడాకులు ఇవ్వడానికి రెడీ అవుతున్నారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చేశారు నయనతార దంపతులు.నయనతార తన భర్త విగ్నేష్ శివన్, పిల్లలతో కలిసి పళని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ కనిపించారు. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ సన్నిహితంగా ఉండటంతో వారి విడాకుల వార్తలకు తెరపడినట్లు అయింది. ఏడేళ్ల పాటు రిలేషన్‌లో ఉండి మరీ విఘ్నేశ్ శివన్‌ను నయనతార పెళ్లాడింది. 2022 జూన్‌లో వీరు వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
Latest News