|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 04:11 PM
ప్రముఖ నటి అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో క్రిష్ భారీ స్థాయిలో దర్శకత్వం వహించిన తెలుగు చిత్రాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఘాటి' ఒకటి. ఈ చిత్రం జులై 11, 2025న పెద్ద స్క్రీన్‌లపైకి రావలిసి ఉంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు వార్తలు వినిపించాయి. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క విడుదల వాయిదాని ధృవీకరిస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ నోట్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఘాతీ పాన్-ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి విద్య సాగర్ సంగీతాని అందిస్తున్నారు.
Latest News