|
|
by Suryaa Desk | Sat, Jul 05, 2025, 07:15 AM
సిజ్లింగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ 'మంగళవరం' సినిమాలో బోల్డ్ రోల్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. 'RX100' తర్వాత పాయల్ రాజ్‌పుత్ దర్శకుడు అజయ్ భూపతి యొక్క రెండవ సినిమా ఇది. అజయ్ భూపతి బోల్డ్ కాన్సెప్ట్‌తో మిస్టరీని లాంగ్‌గా మెయింటైన్ చేస్తూ గ్రిప్పింగ్‌గా కథను చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజ్మల్ అమీర్ నెగిటివ్ రోల్ పోషించాడు. తాజాగా ఇప్పుడు ఈ రూరల్ మిస్టరీ థ్రిల్లర్ 'మంగళవరం' జులై 5, 2025 రాత్రి 9:30 గంటలకు స్టార్ మా మూవీస్ ఛానల్ లో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, అజయ్ గోష్, రవీద్ర విజయ్, దివ్య పిళ్ళై, నందిత శ్వేతా కీలక పాత్రలో నటించారు. ఎ క్రియేటివ్ వర్క్స్ మరియు ముద్ర మీడియా వర్క్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Latest News