|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:35 PM
ప్రియాంక చోప్రా నటించిన యాక్షన్ కామెడీ మూవీనే 'హెడ్స్ ఆఫ్ స్టేట్'. జాన్ సెన్ .. ఇద్రీస్ ఎల్బా తో కలిసి ప్రియాంక నటించిన ఈ సినిమాకి, ఇలియా నైషుల్లెర్ దర్శకత్వం వహించాడు. గతంలో 'నోబడీ' .. 'హార్డ్ కోర్ హేన్రి' అనే యాక్షన్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. ఆ తరువాత సినిమా అయిన 'హెడ్స్ ఆఫ్ స్టేట్', 6 భాషలలో అమెజాన్ ప్రైమ్ లో నేరుగా నిన్ననే విడుదలైంది.
కథ: అమెరికా అధ్యక్షుడు విల్ డెరింజర్ (జాన్ సెన్) బ్రిటీష్ ప్రధాని సామ్ క్లార్క్ (ఇద్రిస్ ఎల్బా) ఒక సమావేశంలో పాల్గొంటారు. డెరింజర్ ముందుగా యాక్షన్ సినిమాల హీరోగా రాణించి, ఆ క్రేజ్ తో అమెరికా అధ్యక్ష పీఠం వరకూ వస్తాడు. క్లార్క్ మాత్రం అనేక ఒడిదుడుకులు ఎదుర్కుంటూ బ్రిటిష్ ప్రధాని స్థానానికి చేరుకుంటాడు. ఇద్దరి అభిప్రాయాలు .. ఆలోచనా విధానాలు వేరుగా ఉంటాయి. అదే విషయం ఆ సమావేశంలో బయటపడుతుంది. అయితే తమ దేశాల మధ్య సఖ్యత అవసరమని భావించిన ఇద్దరూ, తాము చాలా సన్నిహితంగా ఉన్నామని మీడియాను .. ప్రజలను నమ్మించాలని భావిస్తారు. అందుకోసం ఒకే విమానంలో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకుంటారు. అమెరికా అధ్యక్షుడి విమానంలోనే బ్రిటీష్ ప్రధాని కూడా బయలుదేరతాడు. అయితే తమ ఇద్దరినీ చంపడం కోసం శత్రువులు ఆల్రెడీ ప్లాన్ చేశారనే విషయాన్ని గమనించలేకపోతారు. విమానం కొంతదూరం ప్రయాణించే సరికి, దాడి మొదలవుతుంది. ఆ దాడిలో విమానం దెబ్బతింటుంది. విమానం కూలిపోతుందని గ్రహించిన ఇద్దరు నాయకులు కూడా ప్యారాచూట్ ల సాయంతో దూకేస్తారు. అలా దూకినవారు 'బెలారూస్' ఫారెస్టు ఏరియాలో పడతారు. అక్కడి నుంచి బయటపడటానికి వాళ్లు ఏం చేస్తారు? వాళ్లను సురక్షిత ప్రాంతానికి చేర్చడం కోసం MI-6 ఏజెంట్ నోయెల్ (ప్రియాంక చోప్రా) ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.
Latest News