|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 09:09 AM
బహుముఖ నటుడు కమల్ హాసన్ మరియు పురాణ చిత్రనిర్మాత మణి రత్నం కలిసి దాదాపు రెండు దశాబ్దాల తరువాత 'థగ్ లైఫ్' సినిమాకి పని చేసారు. ఈ చిత్రం విడుదలకి ముందు భారీ సంచలనం సృష్టించింది కాని అంచనాలకు అనుగుణంగా రాలేదు. ఈ చిత్రం ప్రతికూల సమీక్షల కారణంగా బాక్స్ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజా అప్డేట్ ఏమిటంటే, థగ్ లైఫ్ ఇప్పుడు తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ మరియు హిందీలలో నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ థియేట్రికల్-టు-ఓట్ విండోను ప్రామాణిక ఎనిమిది వారాల నుండి కేవలం నాలుగు వారాలకి తగ్గించినందుకు మేకర్స్‌పై 25 లక్షల పెనాల్టీ వేసింది. ఈ ఒప్పందం మొదట 135 కోట్లు చివరికి 110 కోట్లు తగ్గించబడ్డాయి. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మణి రత్నం దర్శకత్వం వహించిన చిత్రంలో శింబు, అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, అశోక్ సెల్వన్, నాజర్, ఢిల్లీ గణేష్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, సన్యా మల్హోత్రా, జోజు జార్జ్, జిషు సేన్‌గుప్తా, రోహిత్ సరాఫ్, వైయాపురి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ఆస్కార్ విజేత స్వరకర్త AR రెహ్మాన్ స్వరపరిచిన సౌండ్‌ట్రాక్ ఉంది. ఈ సినిమా మద్రాస్ టాకీస్ మరియు రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్స్ కింద నిర్మించబడింది.
Latest News