|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 02:58 PM
బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అభిషేక్ బచ్చన్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో వార్త నెట్టింట ప్రచారం అవుతూనే ఉంటుంది. వాటికి ఆయన సమాధానం చెప్పినప్పటికీ రూమర్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. నెగెటివిటీని ఎదుర్కోవడంలో తన భార్య ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తానని తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ''నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. కానీ, కొన్నిసార్లు కఠినంగానూ ఉండాలని కాలం మనకు నేర్పుతుంది. ఒక నటుడిగా అలా ఉండడం నాకు కుదరదు. అలా ఉంటే ఆ ప్రభావం నా కెరీర్ మీద పడుతుంది. అది ఆర్టిస్టులకు సవాలుగా మారుతుంది. ఎన్ని విమర్శలు ఎదురైనా నలుగురిని సంతోషపెట్టాలనే మనస్తత్వం నాది. ప్రతికూల సమీక్షలు, నెగెటివ్ విషయాలు చెప్పే వారిపై కూడా దృష్టిపెడతాను. నాపై వచ్చే నెగెటివిటీని ఎదుర్కోవడానికి ఐశ్వర్య ఇచ్చే సలహాను పాటిస్తాను. 'వాటి గురించి ఆలోచించకపోతే.. తప్పుడు వార్తలు మనపై ఎలాంటి ప్రభావం చూపవు. పాజిటివ్ విషయాలపై మాత్రమే దృష్టిపెట్టండి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది' అని ఐశ్వర్య నాకు సలహా ఇచ్చింది. ఇప్పటికీ అదే ఫాలో అవుతుంటాను'' అని అభిషేక్ చెప్పారు. సినిమాల్లోకి మోహన్‌లాల్ కుమార్తె విస్మయ.. దర్శకుడు ఎవరంటే? తాను ఒంటరిగా ఎక్కువ రోజులు ఉండడాన్ని ఇష్టపడనన్నారు అభిషేక్. ''నటుడిగా బిజీగా గడుపుతున్నప్పటికీ అప్పుడప్పుడు మనకోసం కూడా సమయం కేటాయించుకోవాలి. ఏకాంత క్షణాలను ఆస్వాదించాలి. అది చాలా ముఖ్యం. అలాగని నేను ఎక్కువ రోజులు ఒంటరిగా, కుటుంబాన్ని చూడకుండా ఉండలేను. నాకు మాట్లాడడానికి మనిషి కావాలి. ఇంట్లో మేమంతా కలిసే ఉంటాం. సరదాగా గడుపుతుంటాం'' అని చెప్పారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్ 'కాళిధర్ లాపత' ప్రచారంలో బిజీగా ఉన్నారు. 'జీ 5' వేదికగా జులై 4 నుంచి ఇది అందుబాటులోకి రానుంది. అనాథ పిల్లల చుట్టూ తిరిగే కథగా ఇది రూపొందింది. 'కరుపు దురై' అనే తమిళ సినిమాకు రీమేక్‌గా రానుంది.
Latest News