|
|
by Suryaa Desk | Wed, Jul 02, 2025, 08:35 AM
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'రామాయణం' అనే టైటిల్ ని లాక్ చేసారు. రణబీర్ కపూర్ లార్డ్ రామ్ గా, సాయి పల్లవి సీతా దేవతగా మరియు యష్ రావణ్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేసుకున్నారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క టైటిల్ గ్లింప్సె వీడియోని జులై 3న హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఉదయం 11 గంటలకి గ్రాండ్ లాంచ్ ఈవెంట్ లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. యష్ ఈ చిత్రంలో నటించడమే కాక, ప్రైమ్ ఫోకస్ స్టూడియోలతో పాటు తన బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కింద చిత్రాన్ని సహ-నిర్మించాడు. లక్ష్మణ్‌గా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమాన్ గా సన్నీ డియోల్ మరియు దశరథ్‌గా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. రామాయణం యొక్క మొదటి భాగం 2026 దీపావళికి విడుదల అవుతుంది, దాని తర్వాత రెండవ భాగం 2027 దీపావళికి విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని AR రెహ్మాన్ మరియు హన్స్ జిమ్మెర్ స్వరపరిచారు.
Latest News