![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 02:25 PM
టాలీవుడ్ యువ నటుడు నితిన్ రాబోయే ఎమోషనల్ యాక్షన్ డ్రామా చిత్రం 'తమ్ముడు' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. సప్తమి గౌడ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. లయా, లబ్బర్ పాంధు ఫేమ్ స్వాసికా, వర్ష బొల్లమ్మ, మరియు సౌరాబ్ సచదేవా సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ ట్యూన్‌లను కంపోజ్ చేస్తున్నారు. దిల్ రాజు మరియు షిరిష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా జూలై 4, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది.
Latest News