|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:05 PM
కార్తీక్ రాజు దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన '#సింగిల్' మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ చిత్రం సానుకూల సమీక్షలతో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా కేవలం విడుదలైన 5 రోజుల్లో 23.07 కోట్లు వాసులు చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో కేతిక శర్మ మరియు ఇవానా మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వెన్నెలా కిషోర్, ప్రభాస్ శ్రీను, రాజేంద్ర ప్రసాద్, గణేష్ మరియు ఇతరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. మానస, రెబ్ మోనికా, నార్నె నితిన్, సత్య ఈ చిత్రంలో అతిధి పాత్రలలో నటించారు. సాంకేతిక సిబ్బందిలో సినిమాటోగ్రాఫర్‌గా ఆర్ వెల్రాజ్, ఎడిటర్‌గా ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్‌గా చంద్రిక ఉన్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్ పై సమర్పించారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేశారు. కల్యా ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
Latest News