|
|
by Suryaa Desk | Wed, May 14, 2025, 03:01 PM
ప్రముఖ నటి తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన 'ఒడెలా 2' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. ఈ చిత్రం డిజిటల్ ప్లాట్ఫారం లో గత కొన్ని రోజులుగా ట్రేండింగ్ లో ఉంది. సంపత్ నంది రాసిన మరియు అశోక్ తేజా దర్శకత్వం వహించిన ఈ అతీంద్రియ థ్రిల్లర్ లోని గియా గియా వీడియో సాంగ్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అజనీష్ లోకనాథ్ ట్యూన్ చేసిన ఈ సాంగ్ కి అశోక్ తేజ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ యూట్యూబ్ మరియు ఆదిత్య మ్యూజిక్ లో ప్రసారానికి అందుబాటులో రానుంది. ఈ సినిమాలో హెబా పటేల్, వసిష్ట ఎన్. సింహా, మురళ శర్మ, శరత్ లోహితాష్వా, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించారు. మధు క్రియేషన్స్ మరియు సంపత్ నంది టీమ్‌వర్క్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.
Latest News