|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 07:25 PM
కలర్ ఫోటోకు పేరుగాంచిన యువ దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం 'మోగ్లీ 2025' ని యువ నటుడు రోషన్ కనకాల తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బండి సరోజ్ కుమార్, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని సయ్యారే అనే టైటిల్ తో అక్టోబర్ 24న ఉదయం 10 గంటలకి హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కల భైరవ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి చంద్ర బోస్ లిరిక్స్ అందించారు. ఈ విషయాని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ క్రింద టిజి విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 12న విడుదల కానుంది.
Latest News