|
|
by Suryaa Desk | Thu, Oct 23, 2025, 07:14 PM
మోలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ రానున్న పాన్-ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ 'వృషభ' లో కనిపించనున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత నందా కిషోర్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళం మరియు తెలుగులలో ఒకేసారి చిత్రీకరించబడింది, పాన్-ఇండియన్ మరియు ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులకు ప్రామాణికమైన అనుభవాన్ని నిర్ధారిస్తుంది అని భావిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 6న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన అనౌన్స్మెంట్ ని అక్టోబర్ 25న వెల్లడి చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా ఐదు భాషలలో-తెలుగు , మలయాళం, హిందీ, తమిళ మరియు కన్నడలో విడుదల కానుంది. ఈ చిత్రం మెగా బడ్జెట్‌లో రూపొందించబడింది. షోభా కపూర్, ఎక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News