|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 07:15 PM
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన 'సాలార్ పార్ట్ 1: సీసెఫైర్ డిసెంబర్ 22, 2023న భారీ బజ్ మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం డిసెంబర్ 2023లో భారతీయ ప్రధాన భాషల్లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 23, 2025న రీ రిలీజ్ కానుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమాని నైజాం రీజియన్ లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP సొంతం విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతి హాసన్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. పృథ్వీరాజ్ సుకుమారన్, గోపి, ఈశ్వరి రావు, జగపతి బాబు, శ్రీయ రెడ్డి, బ్రహ్మాజీ, బాబీ సింహ, టిన్ను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందించారు. హోంబలే ఫిలింస్ ఈ సినిమాని నిర్మించింది. ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు.
Latest News