|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 06:08 PM
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా విడిగా ఉంటున్న వీరిద్దరిపై ఈ ఊహాగానాలకు శ్రావణ భార్గవి దీపావళి సందర్భంగా కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు, అందులో హేమచంద్ర, కూతురు లేకపోవడం మరింత బలం చేకూర్చిందని చర్చ నడుస్తోంది. అభిమానులు వీరిద్దరి గురించి ఆరా తీయడంతో విడాకుల వార్తలు నిజమేనని, అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉందని పలువురు భావిస్తున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే గాయనీగాయకులు స్పందించాల్సి ఉంది.
Latest News