|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 03:08 PM
ప్రముఖ నటుడు శివాజీ రాబోయే క్రైమ్-కామెడీ-థ్రిల్లర్ తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రంలో శివాజీ కి జోడిగా లయ నటిస్తున్నారు. ఈ ఇద్దరు నటీనటులు 14 సంవత్సరాల తర్వాత తెరపై మళ్లీ కలుస్తున్నారు. కొత్త దర్శకుడు సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టైటిల్ ని 'సాంప్రదాయినీ సుప్పిని సుద్దపూసని' అని లాక్ చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో మోషన్ పోస్టర్ ని కూడా విడుదల చేసింది. హిట్ వెబ్ సిరీస్ 90's లో శివాజీతో కలిసి పనిచేసిన రోహన్ రాయ్ కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఈటీవీ విన్‌తో కలిసి శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివాజీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News