|
|
by Suryaa Desk | Wed, Oct 22, 2025, 02:47 PM
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'ప్రభాస్ -హను' (వర్కింగ్ టైటిల్) ఒకటి. ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ని నటుడి పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం 11:07 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. స్వాతంత్య్రానికి పూర్వం నేపథ్యంలో ఈ చిత్రం 700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, సీనియర్ నటులు జయప్రద, మిథున్ చక్రవర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీత స్వరకర్త. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Latest News