|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 07:43 PM
ప్రముఖ దర్శకుడు త్రివిక్రామ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని విక్టరీ వెంకటేష్ తో ప్రకటించారు. ఈ సినిమా మల్టీస్టారర్ అని టాక్. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర కోసం కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి ఆన్ బోర్డులో ఉన్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకి 'వెంకట రమణ' అనే టైటిల్ ని లాక్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ అక్టోబర్ లో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఈ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. సూర్యదేవర రాధకృష్ణ హారికా మరియు హాసిన్ క్రియేషన్స్ పతాకంపై ఈ బిగ్గీని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన కీలక అప్డేట్స్ ని మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
Latest News