|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 03:19 PM
నటి రేణూ దేశాయ్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’లో హేమలతా లవణం పాత్రలో కనిపించిన ఆమె, ఆ సమయంలో తనపై వచ్చిన విమర్శల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. “నాపై కామెంట్లు చేసిన వాళ్లు ఇప్పటివరకు ఎవరూ క్షమాపణలు చెప్పలేదు. నాకు నటన అంటే ఇష్టం కానీ అది నా జీవిత లక్ష్యం కాదు. డబ్బు కోసం నేను సినిమాలు చేయను’’ అని తెలిపారు. తనకు ఆధ్యాత్మికతపై మక్కువ ఉందని, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశం ఉందని రేణూ దేశాయ్ వెల్లడించారు.
Latest News