|
|
by Suryaa Desk | Tue, Oct 21, 2025, 09:54 AM
దీపావళి పండుగ టాలీవుడ్‌లో సరికొత్త వెలుగులు నింపింది. ఈ పండుగ వేళ అల్లు కుటుంబం నుంచి వచ్చిన ఓ ఫొటో సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఈ ఫొటోలో ఓ ప్రత్యేకత అందరి దృష్టినీ ఆకర్షించింది. తన ప్రేమ, పెళ్లి విషయాల్లో గోప్యత పాటిస్తూ వస్తున్న అల్లు శిరీష్, తన కాబోయే భార్య నైనికను ఈ ఫొటో ద్వారా తొలిసారి అభిమానులకు పరిచయం చేశారు.దీపావళి వేడుకల్లో భాగంగా అల్లు కుటుంబం అంతా ఒక్కచోట చేరి సందడి చేసింది. ఈ సందర్భంగా తీసిన ఫొటోలో అల్లు శిరీష్, నైనిక జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫొటో బయటకు రావడంతో అల్లు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ కొత్త జంటను చూసి 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటివరకు సస్పెన్స్‌లో ఉన్న శిరీష్ కాబోయే భార్యను చూడటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.కొన్ని రోజుల క్రితమే శిరీష్ తన నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫ్రాన్స్‌లోని ఈఫిల్ టవర్ వద్ద నైనిక చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ, "మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా నా జీవితంలోని ఓ ముఖ్యమైన విషయాన్ని పంచుకుంటున్నాను. నేను నైనికతో నిశ్చితార్థం జరుపుకున్నాను" అని ఎంతో ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.పారిస్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగినట్లు సమాచారం. నైనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి అని తెలుస్తుండగా, ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ కొత్త జంట ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
Latest News