|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 05:18 PM
మురళి హీరోగా తమిళంలో రూపొందిన సినిమానే 'థనల్'. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాలో అథర్వ మురళి జోడీగా లావణ్య త్రిపాఠి నటించింది. జాన్ పీటర్ నిర్మించిన ఈ సినిమాకి రవీంద్ర మాధవ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ 12వ విడుదలైన ఈ సినిమా, 'టన్నెల్' పేరుతో తెలుగులోను విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: అఖిల్ (అథర్వ మురళి) అనూ (లావణ్య త్రిపాఠి) ప్రేమించుకుంటారు. తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకుని వెళతారు. అయితే అఖిల్ ప్లస్ టూ దాటక పోవడంతో, అతనితో అనూ పెళ్లి జరిపించడానికి ఆమె తండ్రి నిరాకరిస్తాడు. దాంతో అఖిల్ తన స్నేహితులతో కలిసి కానిస్టేబుల్ జాబ్ తెచ్చుకుంటాడు. రెండేళ్ల క్రితం ఒక ట్రాన్స్ ఫారమ్ పేలిపోయిన ప్రమాదంలో 6 పోలీసులు చనిపోతారు. ఆ ప్లేస్ లో అఖిల్ మిత్ర బృందం జాయిన్ అవుతుంది. అఖిల్ తల్లి ఒక సర్జరీ కోసం హాస్పిటల్లో చేరుతుంది. అందుకు అవసరమైన డబ్బు ఎకౌంటులో ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన ప్రాసెస్ ను పూర్తిచేసే పనిలో అఖిల్ ఉంటాడు. అయితే జాయినింగ్ రోజే అఖిల్ మిత్ర బృందానికి ఒక అనూహమైన సంఘటన ఎదురవుతుంది. ఆ రోజు రాత్రి వాళ్లు ఒక రోడ్డుపై నడుచుకుంటూ వెళుతూ ఉండగా, ఒక వ్యక్తి రోడ్డుపై నున్న డ్రైనేజ్ ప్లేట్ తొలగించుకుని పైకి రావడం చూస్తారు.ఆ వ్యక్తిని ఫాలో అవుతూ ఆరుగురు కానిస్టేబుల్స్ ఒక స్లమ్ ఏరియాకు వెళతారు. అక్కడ ఒక గ్యాంగ్ వారి కంటపడుతుంది. ఆ గ్యాంగ్ ఏం చేస్తుందన్నది అఖిల్ అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ విషయం బయట ప్రపంచానికి చెప్పాలంటే సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు. తాము అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడటం కూడా కష్టమేననే విషయం అఖిల్ బ్యాచ్ కి అర్థమవుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? ఆ గ్యాంగ్ కి లీడర్ ఎవరు? అసలు అక్కడ ఏం జరుగుతోంది? అనేది కథ.
Latest News