|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 04:58 PM
ప్రముఖ టాలెంటెడ్ యువ నటి అను ఇమ్మాన్యుయేల్ తన కొత్త చిత్రం 'బూమరాంగ్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ బాబు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో యువ హీరో శివ కందుకూరి కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన, ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ థ్రిల్లర్ అని చెప్పబడింది. ఈ సినిమా గ్లింప్సెకి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు దీపావళి సందర్భంగా స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసి ప్రేక్షకులకి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సినిమాలో వెనిల్లా కిషోర్, నివాశియని కృష్ణన్, బేబీ లిఖిత, హర్ష కీలక పాత్రలో నటిస్తున్నారు. సితార ఫిలిమ్స్ లిమిటెడ్ ఈ చిత్రానికి లైన్ ప్రొడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు, ఆండ్రూ బాబు కెమెరాను కూడా క్రాంక్ చేస్తున్నారు, ప్రముఖ సంగీత స్వరకర్త అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. లండన్ గణేష్ మరియు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి వూట్ల ఈ ప్రాజెక్ట్‌ను వరుసగా బిగ్ మూవీ మేకర్స్ లిమిటెడ్ మరియు మై3 ఆర్ట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది.
Latest News