|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 03:21 PM
ప్రముఖ నటుడు విష్ణు విశాల్ రాబోయే క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' లో కనిపించనున్నారు. ప్రవీణ్ కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ట్రైలర్ ని విడుదల చేసారు. ట్రైలర్ యాక్షన్ ఎలెమెంట్స్ తో సినిమా పై అంచనాలని పెంచింది. ఈ చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ మరియు మనాసా చౌదరి మహిళా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా హరీష్ కన్నన్ మరియు సంగీత దర్శకుడుగా గిబ్రాన్ ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న విడుదల కానుంది. విష్ణు విశాల్ స్టూడియోజ్, షుబ్రా మరియు ఆర్యన్ రమేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేస్తుంది. ఈ చిత్రం తెలుగు మరియు తమిళంలో విడుదల కానుంది.
Latest News