|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 09:01 AM
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్-టు-బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నారు. వాటిలో 'ప్రభాస్ -హను' (వర్కింగ్ టైటిల్) ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇమన్వి ఇస్మాయిల్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క కీలక అప్డేట్ ని ఈరోజు సాయంత్రం 4:05 గంటలకి రివీల్ చేయటానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 700 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రం షూటింగ్‌లో 50% పూర్తి అయ్యింది. ఈ చిత్రం సుభాష్ చంద్రబోస్ కాలంలో జరిగిన పీరియాడికల్ డ్రామా. ఈ చిత్రంలో ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్‌గా రొమాంటిక్ కథాంశంలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి విశాల్ చంద్రశేఖర్ సౌండ్‌ట్రాక్ అందించనున్నారు. ఈ చిత్రం ఆగష్టు 2026లో విడుదల కానుంది.
Latest News