|
|
by Suryaa Desk | Mon, Oct 20, 2025, 08:37 AM
తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' ఇటీవలే విడుదలై బాక్స్ఆఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. ఈ కామెడీ డ్రామా జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా మూవీస్ ఛానల్ లో అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో శశి మరియు సిమ్రాన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. అబీషన్ జీవింత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భగవంత్, యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మిలియన్ డాలర్ స్టూడియోలు మరియు MRP ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతాన్ని సీన్ రోల్డాన్ స్కోర్ చేశారు.
Latest News