|
|
by Suryaa Desk | Sat, Oct 18, 2025, 06:09 PM
రోహిత్ కెపి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'సంబరాల ఏటిగట్టు' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గ్లింప్స్ ని అసుర ఆగమన అనే టైటిల్ తో విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్ లో 20 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎడిటర్ గా నవీన్ విజయకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ గా అయేషా మరియమ్ ఉన్నారు. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి ఈ సినిమని నిర్మించారు.
Latest News