|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 05:23 PM
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతం చిత్రీకరణ రేపటి నుంచి పూణెలో మొదలుకానుంది. ఈ పాటలో రామ్‌చరణ్‌తో కలిసి జాన్వీ కపూర్ స్టెప్పులేయనున్నారు.ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ఈ పాటను మెలోడీ, ఎనర్జీ కలగలిసిన ట్యూన్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తుండగా, చరణ్ గ్రేస్, జాన్వీతో ఆయన కెమిస్ట్రీ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఈ పాట కీలకంగా ఉండనుందని సమాచారం.
Latest News