|
|
by Suryaa Desk | Thu, Oct 09, 2025, 07:59 AM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరియు టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్‌టిఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'వార్ 2' ఆగస్టు 14, 2025న గ్రాండ్ గా విడుదల అయ్యింది. వార్ 2 అనేది హ్రితిక్ రోషన్ యొక్క 2019 స్పై థ్రిల్లర్, వార్ యొక్క సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ ఎంటర్టైనర్ తెలుగు, హిందీ మరియు తమిళ భాషలలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కోసం ఆంగ్ల ఉపశీర్షికలతో పాటు అందుబాటులో ఉంది. కియారా అద్వానీ ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుండగా, బాబీ డియోల్ అతిధి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో అశుతోష్ రానా మరియు అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ప్రీతమ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
Latest News