|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 09:25 PM
కిడ్నాప్, దాడి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి లక్ష్మీ మీనన్‌కు కేరళ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు, మరో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వివాదాన్ని రాజీ ధోరణిలో సామరస్యంగా పరిష్కరించుకున్నట్లు బాధితుడు (ఫిర్యాది) అఫిడవిట్ దాఖలు చేయడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.జస్టిస్ బెచు కురియన్ థామస్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విచారణ సందర్భంగా, "ఎఫ్ఐఆర్‌లోని ఆరోపణలు ప్రాథమికంగా తీవ్రమైన నేరాలను సూచిస్తున్నాయి. అయితే, ఈ వివాదం పరిష్కారమైందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ఫిర్యాది అఫిడవిట్ దాఖలు చేశారు" అని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడి అఫిడవిట్‌ను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
Latest News