|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 02:49 PM
కోలీవుడ్ నటుడు కార్తీ రాబోయే చిత్రం 'వా వతియార్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. నలన్ కుమారసామి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబరులో విడుదల కానున్నట్లు మేకర్స్ ఇటీవల వెల్లడించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా డిసెంబర్ 5, 2025న పెద్ద తెరపైకి వస్తుందని అధికారిక ప్రకటన ఇస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో కార్తీ చమత్కారమైన పోలీసుగా నటించాడు. కృతి శెట్టి ఈ సినిమాలో కార్తీకి జోడిగా నటిస్తుంది. సత్యరాజ్, రాజ్కిరాన్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణకరన్, జి. ఎం. సుందర్, రమేష్ తిలక్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్ క్రింద కె. ఇ. జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Latest News