|
|
by Suryaa Desk | Wed, Oct 08, 2025, 11:13 AM
నటి సమంత తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యం, జీవిత విలువలను అలవర్చుకోవాలని సూచించారు. తాను పాఠశాలలో నేర్చుకున్న స్నేహం, దయ, సానుభూతి వంటి లక్షణాలే జీవితంలో ఉపయోగపడ్డాయని తెలిపారు. 2023లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగాయని, మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదయ్యాయని తెలిపే వార్తను పంచుకుని విచారం వ్యక్తం చేశారు. తన కొత్త తెలుగు సినిమా షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుందని శుభవార్త అందించారు.
Latest News