|
|
by Suryaa Desk | Tue, Oct 07, 2025, 06:40 PM
ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ తాను రాజకీయాలు చేయడం కోసం కాకుండా, తన ప్రాంతానికి సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ఆమె తన తండ్రితో కలిసి బీహార్ బీజేపీ అధ్యక్షుడు వినోద్ తావ్డే, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌లను కలవడం రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారనే ప్రచారానికి దారితీసింది. ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే తప్పకుండా స్వీకరిస్తానని ఆమె పేర్కొన్నారు. వినోద్ తావ్డే మైథిలీ ఠాకూర్‌ను ‘బీహార్ మానస పుత్రిక’గా అభివర్ణించి, ఆమె బీహారీలకు సేవలు అందిస్తారని తెలిపారు.
Latest News