|
|
by Suryaa Desk | Mon, Oct 06, 2025, 03:59 PM
నటి సయామీ ఖేర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐరన్‌మ్యాన్ ఇంటర్నేషనల్ కమిటీ ఆమెను ‘ఫేస్ ఆఫ్ ఐరన్‌మ్యాన్ ఇండియా’గా ఎంపిక చేసింది. నవంబర్ 9న గోవాలో జరగనున్న ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్‌లో ఆమె భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. ఏడాది వ్యవధిలో రెండు సార్లు ‘ఐరన్‌మ్యాన్ 70.3’ ట్రయథ్లాన్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకుగానూ ఆమెకు ఈ గౌరవం ఆమెకు దక్కింది. కాగా, సయామీ ఖేర్ ఫిట్‌నెస్ ప్రేరణగా నిలుస్తున్నారు.
Latest News