|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 08:13 PM
అయితే, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కొన్ని అనూహ్యమైన మార్గాలు ఎంచుకోవడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఇప్పుడు హోంబలే ఫిల్మ్స్ పై విమర్శల వర్షం కురుస్తోంది.వివరాల్లోకి వెళ్తే, ‘బుక్ మై షో’ యాప్‌లో ఒక ప్రత్యేక ఫీచర్ ఉంటుంది — గంటకు ఎంతమంది టికెట్లు కొనుగోలు చేస్తున్నారో చూపిస్తుంది. ఈ ఫీచర్ చాలా నిజాయితీగా ఉంటుంది అని భావించేవారు. కానీ, ఈ సమాచారాన్ని కూడా మానిప్యులేట్ చేయవచ్చన్న నిజం ‘కాంతారా 2’ విడుదల సమయంలో బయటపడింది.ప్రధమ రోజు, బుక్ మై షోలో ఈ సినిమాకు గంటకు 90 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నట్లు చూపించబడింది. ఆ స్థాయిలో టికెట్లు విక్రయమైనట్లు నిజంగా జరిగుంటే, బాక్సాఫీస్ వద్ద కనీసం ₹130 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉండేది. కానీ వాస్తవంగా ₹89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి.ఇక్కడే సందేహాలు మొదలయ్యాయి. రెండో రోజు తెలుగు, కన్నడ వెర్షన్లకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చినా, ఇతర భాషల్లో థియేటర్లు ఖాళీగా ఉండటం స్పష్టంగా కనిపించింది. అయినప్పటికీ బుక్ మై షోలో గంటకు 60 వేలకు పైగా టికెట్లు అమ్ముడవుతున్నట్టు చూపించబడడం గమనార్హం.దీంతో ట్రేడ్ విశ్లేషకులు ఈ టికెట్ సేల్స్ గణాంకాలపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. మేకర్స్ ఒక ప్రత్యేక టీమ్ ద్వారా ఈ ఫీచర్‌ను మానిప్యులేట్ చేస్తున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఇది కేవలం 'కాంతారా 2'కే పరిమితం కాదు, గతంలో ‘దేవర’, ‘గేమ్ చేంజర్’ సినిమాలకూ ఇదే తరహా ప్రచారాలు జరిగాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఆడియన్స్‌ను ప్రభావితం చేయడానికి, తమ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో చూపించేందుకు ఇలాంటి ట్రిక్స్ మేకర్స్ తరచుగా వాడుతున్నారని, ఈ నేపథ్యంలో ప్రేక్షకులు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. రాబోయే పాన్-ఇండియా చిత్రాలపైనా ఇలాంటి మాయాజాలం జరిగే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.
Latest News