|
|
by Suryaa Desk | Sat, Oct 04, 2025, 05:02 PM
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2'. ఎన్నో అంచనాల నడుమ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఇంకా ఓటీటీలో అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో, హృతిక్ రోషన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సినిమా ఫలితం ఎలా ఉన్నా, దాన్ని స్వీకరించిన తీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'వార్ 2'లో తన పాత్రకు సంబంధించిన ఫోటోను షేర్ చేస్తూ, "కబీర్ పాత్రలో నటించడం ఎంతో సరదాగా అనిపించింది. ఈ ప్రాజెక్ట్‌పై పూర్తి అవగాహన ఉండటంతో, కష్టమైనప్పటికీ ఇష్టంగా పూర్తి చేశాను" అని హృతిక్ పేర్కొన్నారు. తన వర్క్ ఫిలాసఫీని వివరిస్తూ, "దేన్నైనా తేలిగ్గా తీసుకోవాలి. ఒక నటుడిగా మన బాధ్యతను నూటికి నూరు శాతం నిర్వర్తించి ఇంటికి వెళ్లిపోవాలి. ఈ సినిమా విషయంలో నేను ఇదే సూత్రాన్ని పాటించాను" అని స్పష్టం చేశారు.సినిమా చిత్రీకరణ సమయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తనను ఎంతో బాగా చూసుకున్నారని, సన్నివేశాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ ఔట్‌పుట్ కోసం కృషి చేశారని హృతిక్ ప్రశంసించారు.
Latest News