|
|
by Suryaa Desk | Tue, Sep 23, 2025, 09:27 PM
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఓ నిరాధారమైన వార్తపై యువ నటి కల్యాణి ప్రియదర్శన్ తీవ్రంగా స్పందించారు. తాను ఎప్పుడూ చెప్పని మాటలను తనకు ఆపాదిస్తూ ప్రచారం చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అసత్య ప్రచారాలను దయచేసి ఆపాలని కోరుతూ తన అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశారు.వివరాల్లోకి వెళితే, ఇటీవల ఒక సినీ వెబ్‌సైట్ కల్యాణి గురించి ఓ కథనాన్ని ప్రచురించింది. "జీవితం విలువ తెలియడం కోసం నన్ను, నా సోదరుడిని మా తల్లిదండ్రులు వియత్నాంలోని ఓ అనాథాశ్రమంలో వారం రోజుల పాటు ఉంచారు" అని కల్యాణి ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందడంతో కల్యాణి దీనిపై స్పందించారు. "ఈ మాట నేనెప్పుడూ అనలేదు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి" అని ఆమె స్పష్టం చేశారు. ఈ రూమర్ వల్ల తన కుటుంబం ఇబ్బంది పడుతుందని ఆమె పేర్కొన్నారు.
Latest News