|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:59 PM
ప్రముఖ నటుడు, దర్శకుడు ధనుష్ దర్శకత్వంలో నటిస్తున్న 'ఇడ్లీ కడై' సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం కోయంబత్తూరులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.ధనుష్ మాట్లాడుతూ, "నాకు ఎందుకో తెలియదు కానీ, తరచుగా చెఫ్ పాత్రలే వస్తుంటాయి. నిజానికి నేను వంటవాడిని కావాలని బలంగా కోరుకున్నాను. ఆ కోరిక వల్లేనేమో నాకు అలాంటి పాత్రలే దక్కుతున్నాయి. 'జగమే తందిరం'లో పరోటాలు వేశాను, 'తిరుచిత్రాంబళం'లో ఫుడ్ డెలివరీ బాయ్‌గా కనిపించాను. నా గత చిత్రం 'రాయన్'లో ఫాస్ట్ ఫుడ్ షాప్ నడిపాను. ఇప్పుడు ఈ 'ఇడ్లీ కడై' సినిమాలో ఇడ్లీలు వేస్తున్నాను. నేను కథ రాసుకున్నా, వేరే దర్శకులు నా దగ్గరకు వచ్చినా.. నాకు ఇలాంటి పాత్రలే వస్తున్నాయి. దీన్నే మ్యానిఫెస్టేషన్ అంటారేమో" అని నవ్వుతూ అన్నారు.ఈ విషయాన్ని మరింత వివరిస్తూ, "మనం ఏదైతే బలంగా ఆలోచిస్తామో అదే అవుతాం. నటుడినైన తర్వాత కూడా ఈ మ్యానిఫెస్టేషన్ శక్తి నన్ను వెంబడిస్తోంది. యువత కూడా తమ లక్ష్యాలను బలంగా నమ్మాలి. తాము అనుకున్నది సాధించడం కోసం కష్టపడాలి. లక్ష్యంపై ధ్యాస పెట్టి శ్రమిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు. నా జీవితంలో జరిగింది ఇదే" అని యువతకు స్ఫూర్తినిచ్చేలా మాట్లాడారు.
Latest News