|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 12:02 AM
ప్రభాస్ ఈ మధ్యకాలంలో పలు సినిమాలకు తన సపోర్ట్ అందిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా ఆయన చేయి పడిన ప్రతి సినిమా విజయాన్ని అందుకుంటోంది. ఇటీవలి కాలంలో మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఆ వాయిస్ క్రేజ్‌తోనే మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.అంతకుముందు కన్నప్ప సినిమాలో ప్రభాస్ ముఖ్య పాత్ర పోషించాడు. వరుస ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్న మంచు విష్ణుకు ఆ సినిమా ఘనవిజయం తెచ్చిపెట్టింది.ఇప్పుడు ప్రభాస్ చేయి పడబోతున్న మరో సినిమా కాంతార 1. రిషబ్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను రేపు ప్రభాస్ విడుదల చేయనున్నారు. దీంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.‘ప్రభాస్ సెంటిమెంట్’ ఈ సినిమాకి కూడా కలిసొస్తే, మూవీ రేంజ్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ముందుగానే లెక్కలు వేస్తున్నారు. అసలే కాంతార మొదటి భాగం సెన్సేషనల్ హిట్ కావడంతో, సీక్వెల్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ ఇండియా ఇమేజ్ కలిసివస్తే, బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.
Latest News